Upendra : నేను ఆరోగ్యంగానే ఉన్నాను : ఉపేంద్ర క్లారిటీ

by Muthe.Rajitha |

తన ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్(Health Rumors) పై కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర(Upendra) క్లారిటీ ఇచ్చాడు.

Upendra : నేను ఆరోగ్యంగానే ఉన్నాను : ఉపేంద్ర క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తన ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్(Health Rumors) పై కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర(Upendra) క్లారిటీ ఇచ్చాడు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, సాధారణ చెక్‌అప్ కోసమే ఆసుపత్రికి వెళ్లాలని తెలిపారు. ఈ మేరకు ఉపేంద్ర తన X ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు. అందులో "ఎల్లరిగూ నమస్కారం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను.. రెగ్యులర్ చెక్‌అప్ కోసం ఆస్పత్రికి వెళ్లాను, అంతే. ఎలాంటి వదంతులూ నమ్మొద్దు. మీ ప్రేమ, కేర్‌కి థ్యాంక్స్." అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసరికి ఆయన అభిమానులు సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే 'UI' సినిమా చిత్రీకరణ సమయం నుంచే ఉపేంద్ర అనారోగ్యంగా ఉన్నారని, అది తీవ్రం కావడంతో సోమవారం ఆసుపత్రిలో చేరినట్టు సోషల్ మీడియాలో, వార్తా సంస్థల్లో భారీగా ప్రచారం జరిగింది.

దీంతో ఆయన అభిమానులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఉపేంద్ర ఆఫీసుకు వందలాది ఫోన్లు వచ్చినట్టు సిబ్బంది తెలిపారు. ఈ ఫేక్ న్యూస్ ప్రచారం నేపథ్యంలో ఉపేంద్ర ఈ క్లారిటీ ఇచ్చారు. కాగా గత ఏడాది 'UI' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉపేంద్ర.. ఈ ఏడాది శివరాజ్ కుమార్(Shivaraj Kumar) తో కలిసి నటిస్తున్న '45', రజినీ కాంత్(Rajini Kanth) 'కూలీ' తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

Next Story