జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌

by Ajay Maddhiboyina |

ఏపీలో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానాల‌పై ఎన్డీఏ కూట‌మి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ స్థానాల‌ను టీడీపీకి 3, జ‌నసేన‌కు ఒక‌టి చొప్పున కేటాయించాల‌ని నిర్ణ‌యించింది.

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానాల‌పై ఎన్డీఏ కూట‌మి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ స్థానాల‌ను టీడీపీకి 3, జ‌నసేన‌కు ఒక‌టి చొప్పున కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. మొద‌ట బీజేజీకి ఒక స్థానం ఇవ్వాల‌ని ఆలోచించిన‌ప్ప‌టికీ టీడీపీలో పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో చంద్ర‌బాబు నాలుగు స్థానాలు త‌మ‌కే కేటాయించాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ సైతం వెన‌క్కి త‌గ్గింది. ఇక జ‌న‌సేన నుండి రాజ్య‌స‌భ‌కు వెళ్లే అభ్య‌ర్థిని ఆ పార్టీ దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. జ‌న‌సేన రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా లింగ‌మ‌నేని ర‌మేశ్ పేరును దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది.

సాయంత్రం ఈయ‌న పేరును జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అధికారికంగా ప్రక‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుండి స‌మాచారం అందుతోంది. ఇదిలా ఉంటే లింగమనేని రమేష్ ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఈయన లింగమేని ఎస్టేట్స్, ఎల్ఈపీఎల్ గ్రూప్ సంస్థలకు చైర్మన్ గా ఉన్నారు. ఆ త‌ర‌వాత కాలంల ఏవియేష‌న్ రంగంలోకి సైతం ప్ర‌వేశించారు. ఎయిర్ కోస్టా అనే విమాన‌యాన సంస్థ‌ను స్థాపించారు. అంతేకాకుండా ఈయ‌న గ‌తంలో చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా గుర్తింపు పొందారు. చాలా కాలంగా ప‌వ‌న్ రాజ్య‌స‌భ‌కు ఈయ‌న పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక దీనిపై సాయంత్రం పూర్తి క్లారిటీ రానుంది.

Next Story