- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగ చైతన్యతో సినిమా చేస్తున్నా.. ఈ ఇయరే రిలీజ్ అవుతుంది.. మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘అనగనగా ఒక రాజు’(anaganaga Oka raju).

దిశ, వెబ్‌డెస్క్: మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘అనగనగా ఒక రాజు’(anaganaga Oka raju). ఇందులో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటిస్తుండగా మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సితార ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
కాగా ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ చేసిన హీరోయిన్ మీనాక్షి వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో నాగ చైతన్యతో చేస్తున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తున్నాను. అయితే ఆ సినిమా ఈ ఇయర్ మధ్యలో రిలీజ్ అవుతుంది’ అని చెప్పుకొచ్చింది.
కాగా నాగ చైతన్య హీరోగా, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో “NC24” వర్కింగ్ టైటిల్‌తో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కతున్నది. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ సమర్పిస్తున్నారు. అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తుండగా, ‘లాపాటా లేడీస్’ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
Read More..






