- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Niharika: మహేష్ బాబు నా మొగుడని ఫిక్స్ అయ్యా.. ఇప్పటికీ అతనే నా క్రష్ అంటూ బిగ్ బాంబ్ పేల్చిన నిహారిక (వీడియో)
బుల్లితెర నటి నిహారిక(niharika) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎన్నో షోలు చేసి ప్రేక్షకులను అలరించింది.

దిశ, సినిమా: బుల్లితెర నటి నిహారిక(niharika) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎన్నో షోలు చేసి ప్రేక్షకులను అలరించింది. అలాగే తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక ‘పెరుసు’(Perusu) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. అయితే తెలుగులో ‘పెద్ద’టైటిల్‌తో రాబోతుంది. ఇలంగో రామ్(Ilango Ram) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో వైభవ్ రెడ్డి(Vaibhav Reddy) హీరోగా నటిస్తుండగా.. స్టోన్‌బెంచ్ ఫిలిమ్స్, బ్యావేజ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కార్తికేయన్, హర్మాన్ బివేజ్, హిరణ్య పెరేరా నిర్మిస్తున్నారు.
కామెడి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాందిని(Chandni), సునీల్ రెడ్డి, చాలా వీనోద్, అశోక్ నారాయణ్(Ashok Narayan) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా సమ్మర్ కానుకగా థియేటర్స్‌లోకి రానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక, మహేష్ బాబుపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘మహేష్ బాబు(Mahesh Babu) లాంటి వాడిని మళ్లీ ఇంత వరకు ఎక్కడా చూడలేదు. ఆయన అద్భుతంగా ఉంటాడు. అయితే నాకు ఐదేళ్లు ఉన్నప్పుడే మహేష్ బాబును బిగ్ స్క్రీన్ మీద చూశాను.
‘మురారి’లో ఆయనను మొదటిసారి టీవీలో చూశాను. వెంటనే ఇతనే నా మొగుడని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు అసలు ఫీలింగ్ ఏంటో కూడా తెలియదు. అయినా ఇప్పటికీ మహేష్ బాబు నా క్రష్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఓ మిల్క్ మ్యాన్.. మిల్క్ అనేది మనిషిలా మారితే అది మహేష్ బాబులానే ఉంటారు. అయితే ఆయన ఇంతవరకు ఎవ్వరితోనూ రిల్స్ చేయలేదు. కేవలం నాతోనే చేశారు. అది రూడా రెండు రీల్స్ చేశాడు దానికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఇక అది చూసిన నెటిజన్లు బిగ్ బాంబ్ పేల్చిందని అభిప్రాయపడుతున్నారు.






