నా అభిమానులు నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది.. ‘టాక్సిక్’ వాయిదాపై యష్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఈ సినిమా రిలీజ్‌కు మరికొంత సమయం తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం నా అభిమానులకు, భారతీయ ప్రేక్షకులకు నచ్చదనే విషయం నాకు తెలుసు.

నా అభిమానులు నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది.. ‘టాక్సిక్’ వాయిదాపై యష్ కామెంట్స్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. యష్ స్వయంగా కథ అందించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. రెండుసార్లు విడుదల వాయిదా పడటంతో యష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తాజాగా, ఈ విషయంపై హీరో యష్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ.. ఇటీవల ‘సినిమాకాన్’లో ఈ చిత్రానికి వచ్చిన అద్భుతమైన గ్లోబల్ రెస్పాన్స్ చూశాక, దీనిని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతో రెండోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై యష్ మాట్లాడుతూ.. "ఈ సినిమా రిలీజ్‌కు మరికొంత సమయం తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం నా అభిమానులకు, భారతీయ ప్రేక్షకులకు నచ్చదనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి షూటింగ్ మొదలైతే, ఒక నిర్దిష్ట సమయంలో సినిమా రావాలని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ పాశ్చాత్య దేశాలలో మూవీ పూర్తిగా పూర్తయిన తర్వాతే బిజినెస్, మార్కెటింగ్ మొదలవుతుంది. భారీ బడ్జెట్ ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసమే మేము సమయం తీసుకుంటున్నాము. నా అభిమానులు నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది" అని తెలిపారు.

Next Story