నేను పూర్తిగా ప్రకృతి బిడ్డను.. ఒంటరిగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్

by I. Sairam |

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నేను పూర్తిగా ప్రకృతి బిడ్డను.. ఒంటరిగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..  ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది.

ఈ మూవీలో ఈ భామ, యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక రీసెంట్‌గా కన్నడ స్టార్ హీరో సిద్ధార్థ్(Sidharth) సరసన ‘మిస్ యూ’(Miss You) మూవీలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

క్యాజువల్ వేర్‌లో దర్శనమిచ్చింది. అంతే కాకుండా అడవి మధ్యలో ఉన్న ఓ నదిలో ప్రయాణం చేస్తూ వయ్యారాలు ఒలకబోసింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటికి.. ‘అడవిలో మాత్రమే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు నా మనసు ఆగుతుంది.. పూర్తిగా నేను ప్రకృతి బిడ్డ’ అని రాసుకొచ్చింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు వావ్ క్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story