- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఎప్పుడూ నా లుక్స్ కంటే పాత్రను పండించడం పైనే ఎక్కువ శ్రద్ధ పెడతాను: శార్వరి వాఘ్
ప్రస్తుత కాలంలో నటీనటులకు లుక్స్ కంటే వారి నటన, ప్రతిభే అత్యంత ముఖ్యం. ఇప్పుడున్న ప్రోస్తెటిక్స్ టెక్నాలజీతో ప్రతి సినిమాలోనూ సరికొత్తగా కనిపించవచ్చు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శార్వరి వాఘ్ భారీ యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’లో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆలియా భట్‌తో తనకున్న బాండింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ‘‘ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్లు స్నేహితులుగా ఉండలేరనేది ఒక పెద్ద అబద్ధం. ఆమె నాపై చూపించిన ప్రేమ, సపోర్ట్ నిజంగా ఎంతో గొప్పవి. మా సినిమా టీమ్ అందరికీ ఆమె ఒక పెద్ద చీర్‌లీడర్ లాంటిది. కెరీర్ ప్రారంభంలోనే నేను, వేదాంగ్‌తో కలిసి ఇంతియాజ్ సర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నామని తెలియగానే ఆలియా మాకు మెసేజ్ చేసింది. 'మీ కెరీర్ స్టార్టింగ్‌లో మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి ఇంతియాజ్ సర్ కంటే బెస్ట్ డైరెక్టర్ దొరకరు, ఆయన మీకు ఎంతో హెల్ప్ చేస్తారు' అని చెప్పింది. ఆలియా చెప్పిన మాటల అర్థం అప్పుడు నాకు తెలియలేదు కానీ, ఇప్పుడు ప్రాక్టికల్‌గా అర్ధమవుతోంది" అని శార్వరి ఎమోషనల్ అయింది.
ఆలియా భట్ అంటే తనకు, వేదాంగ్‌కు ఎంతో ఇష్టమని.. ఆమె అద్భుతమైన నటి మాత్రమే కాదు, అంతకంటే మంచి మనసున్న వ్యక్తి అని శార్వరి కొనియాడింది. ‘ఆల్ఫా’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ఆమె పక్కన నిలబడి యాక్టింగ్ నేర్చుకోవడం తనకు దక్కిన ఒక అమూల్యమైన అనుభవమని శార్వరి సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సినీ పరిశ్రమలో ప్రతిభ కంటే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? అనే ప్రశ్నకు ఎంతో మెచ్యూర్డ్‌గా సమాధానమిచ్చింది. "ప్రస్తుత కాలంలో నటీనటులకు లుక్స్ కంటే వారి నటన, ప్రతిభే అత్యంత ముఖ్యం. ఇప్పుడున్న ప్రోస్తెటిక్స్ టెక్నాలజీతో ప్రతి సినిమాలోనూ సరికొత్తగా కనిపించవచ్చు. ప్రేక్షకులు కూడా మన స్క్రీన్ ప్రెజెన్స్ కంటే మనం చేసే క్యారెక్టర్‌ను, మన నటనను చూసే ఆదరిస్తున్నారు. అందుకే నేను ఎప్పుడూ నా లుక్స్ కంటే పాత్రను పండించడం పైనే ఎక్కువ శ్రద్ధ పెడతాను" అని శార్వరి స్పష్టం చేసింది.






