- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య మాట్లాడినా, బన్నీ నవ్వినా ట్రోలింగే..రెచ్చిపోయిన హైపర్ ఆది
తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి రాజమౌళి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పైన కూడా ఇప్పుడు

దిశ, వెబ్ డెస్క్: దర్శకధీరుడు రాజమౌళిపై గత రెండు రోజులుగా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. హనుమంతుడిని అవమానించాడన్న ఒక్క కారణంతో రాజమౌళిపై హిందూ సంఘాలు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో రాజమౌళికి సపోర్ట్ గా నిలిచారు హైపర్ ఆది. వారణాసి ఈవెంట్ సందర్భంగా హనుమంతుడిపై రాజమౌళి అలిగారు కానీ, అవమానించలేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు హైపర్ ఆది. ఓ సినిమా రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి రాజమౌళి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పైన కూడా ఇప్పుడు కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతుని గురించి రాజమౌళి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అనవసరంగా వివాదాన్ని పెద్దగా చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ట్రోలింగ్, బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు హైపర్ ఆది. సాయి దుర్గ తేజ్ యాక్సిడెంట్ వల్ల మాట్లాడలేకపోయినా ట్రోలింగ్, ప్రభాస్ లుక్స్‌పై ట్రోలింగ్, రామ్ చరణ్ ‘చికిరి’ సాంగ్‌పై కూడా ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహించారు. ఇకపై ట్రోలింగ్ చేయడం ఆపి, సినిమా వాళ్లకు గౌరవం ఇవ్వండని కోరారు. క్లిక్






