చిక్కుల్లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌.. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి NHRC ఆదేశం

by Gantepaka Srikanth |

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) చిక్కుల్లో పడ్డారు.

చిక్కుల్లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌.. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి NHRC ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) చిక్కుల్లో పడ్డారు. షారుక్‌ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌(Aryan Khan) తెరకెక్కించిన ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ వెబ్‌సిరీస్‌‌లో రణ్‌బీర్‌ పోషించిన పాత్ర వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే.. ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో రణ్‌బీర్‌ గెస్ట్ రోల్ చేశారు. అందులో ఎలక్ట్రానిక్‌ సిగరెట్ల చట్టాన్ని అతిక్రమించి, ఈ- సిగరెట్‌ను వినియోగిస్తూ రణ్‌బీర్‌ నటించడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ(National Human Rights Commission) సీరియస్ అయింది. రణ్‌బీర్‌తో పాటు ఆ వెబ్ సిరీస్ నిర్మాతలుపై కేసు నమోదు చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. యువతను తప్పుదోవ పట్టించే విధంగా రణ్‌బీర్‌ పాత్ర ఉందని.. ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదని.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ వెబ్‌ సిరీస్‌లో లక్ష్య, బాబీ డియోల్, సహేర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్ గెస్ట్ రోల్స్ చేశారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా అతిథి పాత్రలో మెరిశారు. ఈ నెల 18న ఈ సిరీస్‌ విడుదలైంది.

Next Story