- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరువీర్‌కు భారీ ప్రశంసలు.. లెజెండరీ యాక్టర్‌తో పోల్చిన అజయ్ ఘోష్
అజయ్ ఘోష్ మాట్లాడుతూ, “తిరువీర్ అంటే అసలు తిరిగే లేదు. ఆయన నటన చూస్తుంటే నాకు విజయ్ సేతుపతి గుర్తొస్తుంటాడు” అంటూ ప్రశంసలు కురిపించాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో అజయ్ ఘోష్ ఒకరు. ఈయన సినిమాల్లో ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల్లో ఈయన వేషధారణ ఎలా ఉన్నా, బయట మాత్రం అత్యంత సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తూ ఉండడం కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈయన తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఎస్. పి. దుర్గా నరేష్ దర్శకత్వం వహించారు. యంగ్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ ఇందులో తిరువీర్‌కు జంటగా నటించింది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఈరోజు మధ్యాహ్నం నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా అజయ్ ఘోష్, తిరువీర్ నటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అజయ్ ఘోష్ మాట్లాడుతూ, “తిరువీర్ అంటే అసలు తిరిగే లేదు. ఆయన నటన చూస్తుంటే నాకు విజయ్ సేతుపతి గుర్తొస్తుంటాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన చేసే నటన చూస్తే కళ్లల్లో నీళ్లు వస్తుంటాయి. ఇదేంటి ఈయన ఇంతలా యాక్ట్ చేస్తున్నాడని అనిపించేది. ఆయన ఒక గొప్ప నటుడు” అని ప్రశంసలు కురిపించారు. ఏకంగా విజయ్ సేతుపతి వంటి లెజెండరీ నటుడితో తిరువీర్‌ను పోల్చడంతో, అజయ్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.






