- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indraneil-Meghna: నటి ఇంట్లో భారీ పేలుడు.. భయమేస్తుందంటూ ఎమోషనల్ కామెంట్స్ (వీడియో)
బుల్లితెర నటి మేఘన(Meghana), ఇంద్రనీల్(Indraaniel) ఇద్దరు ‘చక్రవాకం’ సీరియల్‌లో నటించి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

దిశ, సినిమా: బుల్లితెర నటి మేఘన(Meghana), ఇంద్రనీల్(Indraaniel) ఇద్దరు ‘చక్రవాకం’ సీరియల్‌లో నటించి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి పెళ్లై చాలా ఏళ్లు పూర్తి అవుతున్నప్పటికీ పిల్లు మాత్రం పుట్టలేదు. అయితే నిత్యం మేఘన పిల్లలు పుట్టలేదని ట్రోల్ వారికి స్ట్రాంగ్‌గా సమాధానాలు చెప్తూ ఉంటుంది. అలాగే ఇంద్రనీల్, మేఘన యూట్యూబ్ చానల్‌తో పాటు పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేశారు. దీంతో వీరిద్దరు బుల్లితెరకు దూరం అయ్యారు. అప్పుడప్పుడు పలు షోస్‌లో జంటగా పాల్గొంటున్నారు.
అలాగే తమ వంటకాలతో అందరి మనసులు గెలుచుకుంటున్నారు. అయితే మేఘన చేసే వంటకాలు చాలా మంది ఫాలో అయి.. వారు కూడా ఇంట్లో చేసుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. ఈ జంట నిత్యం ఏదో ఒక పోస్టు పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా, ఈ జంట భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంట్లో గ్యాస్‌స్టవ్ పేలిందని తెలుపుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక ఈ వీడియోను తమ యూట్యూబ్ చానల్‌లో పెట్టారు. ‘‘నేను హాల్‌లో కూర్చున్న సమయంలో కిచెన్ నుంచి భారీ శబ్దం వినిపించింది. ఏసీ పేలిందేమోనని అన్ని గదుల్లోకి వెళ్లి చూశాను కానీ కనిపించలేదు.
కిచెన్‌లోకి వెళ్లి చూసేసరికి గ్యాస్‌స్టవ్ నా కళ్లముందే పగులుతోంది. దానిని మూడేళ్లకిందటే తీసుకున్నాను. నేను ఆర్టిస్ట్‌ను కాబట్టి ఆ స్టవ్ ముక్కలు నా ముఖానికి గుచ్చకుంటే నా పరిస్థితేంటి? నా కెరీర్ ఏం కావాలి. ఇది చిన్న ప్రమాదం కాదు. దీనిపై మేము కచ్చితంగా కోర్టుకెళ్తాం. గ్యాస్ స్టవ్ వాడాలంటేనే భయంగా ఉంది. అందుకే ఇకపై స్టీల్ స్టైవ్‌నే వాడుతాను. దయచేసి వంటింట్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సమస్య చాలా మందికి ఎదురవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.






