Kuberaa: గ్రాండ్ రిలీజ్‌కు ముందే సంధ్య థియేటర్ వద్ద కింగ్ నాగార్జున-ధనుష్‌ల భారీ కటౌట్లు

by Kodari Anjali |   (  Updated:2025-06-14 14:07:23  IST  )

కుబేర చిత్రం కోసం ప్రేక్షకులు అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Kuberaa: గ్రాండ్ రిలీజ్‌కు ముందే సంధ్య థియేటర్ వద్ద కింగ్ నాగార్జున-ధనుష్‌ల భారీ కటౌట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కుబేర చిత్రం కోసం ప్రేక్షకులు అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో అగ్ర హీరోలైన నాగార్జున అండ్ ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా కనిపించనుంది. జూన్ 20 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం సైలెంట్‌గా జరుగుతున్నాయి. ఈ మూవీ తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఈ మూవీ ప్రేక్షకుల అంనచనాలకు మించి ఉంటుందని ఇప్పటికే నాగార్జున ఓ ఇంటర్వ్వూలో భాగంగా చెప్పారు. దీంతో జనాల్లో భారీ హైప్ పెరిగింది.

టీజర్ అండ్ పాటలకు కూడా భారీ రెస్పాన్స్ లభించడంతో టీంలో జోష్ పెరుగుతుంది. మొత్తానికి తక్కువ ప్రమోషన్‌తో ఎక్కువ సందడి చేయాలని చూస్తున్నారు కుబేరా చిత్ర బృందం. ఇక ఈ మూవీలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లాంటి స్టార్స్ ఉన్నా.. స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేయట్లేదని నిన్నటి వరకు నెటిజన్లలో కాస్త నిరాశ ఉండేది. కానీ తాజాగా టీమ్ కుబేరా ప్రీరిలీజ్ ఈవెంట్ ను రేపు (జూన్ 15) నిర్వహిస్తామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇకపోతే కుబేర గ్రాండ్ రిలీజ్ కు ముందే సంధ్య థియేటర్ వద్ద కింగ్ నాగార్జున అండ్ ధనుష్ రాజ్‌ల భారీ కటౌట్లు వెలిశాయి. ప్రస్తుతం వీరి కటౌట్లను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Instagram post link

Next Story