- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిల్ రావిపూడి-చిరంజీవి సినిమాకు భారీ కలెక్షన్స్.. పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఇక ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండగా, ఫెస్టివల్ సీజన్‌కు తగ్గట్టు సినిమా థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అలా సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్తోంది.
ఈ క్రమంలో ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అలా రిలీజ్ అయిన ఐదు రోజుల్లో రూ.226 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ తెలియజేశారు. ఓ ప్రాంతీయ చిత్రానికి ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని రాసుకొచ్చారు. కాగా ఈరోజు, రేపు వీకెండ్ కాబట్టి ఇదే ఊపులో మరింత ఎక్కువ కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తోంది.
Read More..
‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు






