- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ లైనప్‌లో భారీ మార్పులు.. స్పిరిట్‌పై ప్రభావం
ప్రభాస్ బిజీ అయినా ‘స్పిరిట్’ షూటింగ్ ఆపని సందీప్ రెడ్డి వంగా

Prabhas Injured on Fauzi Sets
దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘కల్కి 2898 AD 2’ చిత్రాలతో పాటు ‘స్పిరిట్’ సినిమాను కూడా ప్రారంభించారు. ‘స్పిరిట్’ చిత్రాన్ని వచ్చే సంవత్సరం మార్చి 5న విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘కల్కి 2898 AD 2’ చిత్రాలపై ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్లలో ఆయన బిజీగా పాల్గొంటున్నప్పటికీ, ‘స్పిరిట్’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ప్రభాస్ లేని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ప్రభాస్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ కంటే ‘ఫౌజీ’, ‘కల్కి 2’ చిత్రాలపై ఎక్కువ దృష్టి పెట్టినా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంతో వేగంగా పనులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తృప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్ మరియు ప్రభాకర్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






