Ram Charan: ‘పెద్ది’ ఫ‌స్ట్ లుక్ ఎఫెక్ట్.. భారీగా అమ్ముడుపోయిన ఆడియో రైట్స్

by Chukka Sudharani |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రజెంట్ ‘RC16’తో బిజీ అయిపోయాడు.

Ram Charan: ‘పెద్ది’ ఫ‌స్ట్ లుక్ ఎఫెక్ట్.. భారీగా అమ్ముడుపోయిన ఆడియో రైట్స్
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రజెంట్ ‘RC16’తో బిజీ అయిపోయాడు. బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ (First look poster) రిలీజ్ కాగా.. సోషల్ మీడియా(Social media)లో మంచి రెస్పాన్స్ (Response) దక్కించుకుంది. ఈ పోస్టర్‌లో చరణ్ గ్యాంగ్ లీడర్ (Gang leader) రేంజ్‌లో నోట్లో బీడీ పెట్టుకుని ఊరమాస్ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం కన్ఫార్మ్ అని ఫిక్స్ అయిపోయారు మెగా ఫ్యాన్స్.

ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ మూవీకి సంబంధించి మరో బిగ్గెస్ట్ న్యూస్ (Biggest news) నెట్టింట వైరల్ అవుతోంది. ‘రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఆడియో రైట్స్‌ని టీ-సిరీస్ (T-Series) సంస్థ రూ.25 కోట్లకు ద‌క్కించుకుందని’ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. దీంతో.. ‘పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా వచ్చిందో లేదో.. అప్పుడే బిజినెస్ట్ స్టార్ట్ అయిందా’ అని ‘చ‌ర‌ణ్ కెరీర్‌లో ఇదే బెస్ట్ ఫిగ‌ర్‌’ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాకు శివ రాజ్ కుమార్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Next Story