హే తారక్ నువ్వు అస్సలు ఊహించలేవు అంటూ హృతిక్ పోస్ట్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటంటే?

by Chukka Sudharani |   (  Updated:2025-05-17 12:09:55  IST  )

ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న చిత్రాల్లో ‘వార్-2’(War-2) ఒకటి. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

హే తారక్ నువ్వు అస్సలు ఊహించలేవు అంటూ హృతిక్ పోస్ట్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న చిత్రాల్లో ‘వార్-2’(War-2) ఒకటి. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వార్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన లుక్ పోస్టర్లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇందులో భాగంగా రీసెంట్‌గా వార్-2 నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.

అయితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఓ ప్రత్యేకమైన ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు హృతిక్ రోషన్. ‘హేయ్.. తారక్.. ఈ ఏడాది మే 20న ఏమి జరుగుతుందో నీకు తెలుసు అనుకుంటున్నావా? నన్ను నమ్ము.. నువ్వు దానిని ఊహించలేవు కూడా.. వార్ 2 కోసం సిద్ధంగా ఉండు’ అంటూ ట్వీట్ పెట్టాడు. ఇక ఈ ట్వీట్‌పై స్పందించిన ఎన్టీఆర్.. హృతిక్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘అడ్వాన్స్‌గా మీకు థాంక్యూ హృతిక్.. నిన్ను వేటాడి నీకు ఆ ప్రత్యేక బహుమతి తిరిగి ఇవ్వడానికి వేచి ఉండలేను కబీర్’ అంటూ తెలిపాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story