‘జైలర్ 2’లో హృతిక్ రోషన్.?

by Pulgam srinivas |

‘జైలర్ 2’లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

‘జైలర్ 2’లో హృతిక్ రోషన్.?
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పలువురు స్టార్ హీరోలు క్యామియో పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ ఈ చిత్రంలో స్పెషల్ రోల్‌లో కనిపించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. హృతిక్ రోషన్ నిజంగానే ఈ చిత్రంలో భాగమైతే హిందీ సినీ పరిశ్రమలో ‘జైలర్ 2’పై అంచనాలు తారాస్థాయికి చేరే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ నటిస్తాడా? లేదా? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇక ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ క్యామియో పాత్రల్లో కనిపించనుండగా, విద్యా బాలన్, ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణన్, యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Next Story