ఒక్క ఏడాదిలో ఇద్దరిని కోల్పోయా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. రాధిక ఎమోషనల్ పోస్ట్

by Chukka Sudharani |

దిగ్గజ దర్శకుడు భారతీరాజా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

ఒక్క ఏడాదిలో ఇద్దరిని కోల్పోయా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. రాధిక ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: దిగ్గజ దర్శకుడు భారతీరాజా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఓ గురువుగా ఆయనతో విడదీయరాని అనుబంధం ఏర్పచుకున్న సీనియర్ నటి రాధిక.. భారతీరాజా మరణాన్ని జీర్ణించుకోలేకోపోతున్నానంటూ వరుస పోస్టులు పెడుతూ ఎమోషనల్ అవుతున్నారు. ఆయనతో దిగిన ఫొటోలను పంచుకుంటూ.. ‘నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేలా నన్ను తీర్చిదిద్దిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు నా తల్లి, మరొకటి నా గురువు భారతీరాజా. ఒక్క ఏడాదిలో మీ ఇద్దరిని కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా. ఈ వేదన మాటల్లో చెప్పలేను. ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. హృదయం బరువెక్కి పోతుంది. నా బాధను అర్థం చేసుకుని, నాతో నిలిబడి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తలవంచి నమస్కరిస్తున్నాను. వారి జ్ఞాపకాలు, వారు నాకు నేర్పిన జీవిత పాఠాలు ఎప్పుడూ నాతో ప్రయాణిస్తూనే ఉంటాయి. భారతీరాజా సర్.. మీరే నా సర్వస్వం, మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. కాగా.. రాధికను హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది భారతీరాజానే.

Next Story