- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెట్‌లో తారక్‌ను చూసి చాలా నేర్చుకున్నా..హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో హృతిక్ రోషన్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. సెట్స్ లో తాను కేవలం ఎన్టీఆర్‌ను గమణించలేదని, ఆయన నుండి చాలా నేర్చుకున్నానని అన్నారు. అతడు వన్ టేక్ ఫైనల్ టేక్ స్టార్ అని కొనియాడారు. సింగిల్ షాట్‌లో ఒక సన్నివేశంలో ఎలా నటించాలో ఎన్టీఆర్‌ను చూసే నేర్చుకున్నానని తెలిపారు.
ఎన్టీఆర్ ఒక షాట్‌లో నటించాడు అంటే అందులో వందశాతం ఇస్తాడని చెప్పారు. సీన్ చేసిన తరవాత తిరిగి చూడాల్సిన అవసరం లేదని, తారక్ కూడా తిరిగి చూసుకోడని అన్నారు. ఈ విషయాన్ని నేర్పించినందుకు ఎన్టీఆర్‌కు థాంక్స్ చెప్పారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో హృతిక్ రోషన్‌ను చూసి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా దీనిని నిర్మించారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు.






