Daku Maharaj: బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..? ట్వీట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-01-15 13:43:53  IST  )

నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ).

Daku Maharaj: బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..? ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal, శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మించారు. ఇక ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు 3వ రోజు వచ్చిన కలెక్షన్స్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 92 కోట్ల ప్లస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం మేకర్స్ ట్వీట్ వైరల్ అవుతుండగా.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

Next Story