- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa 2: పుష్ప 2 లో ఇంత చిన్న తప్పును ఎలా మర్చిపోయారు..? సుకుమార్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!
సుకుమార్ ఈ సినిమాలో చిన్న తప్పు చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు

దిశ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ పుష్ప 2 ( pushpa 2 ) . ఈ సినిమాలో అల్లు అర్జున్ ( Allu Arjun ) , హీరోయిన్ రష్మిక మందాన ( Rashmika Mandanna ) కలిసి నటించారు. ఇక , ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాలన్నీ దాటుకుని రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో, బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, పుష్ప 2లో క్లైమాక్స్ సీన్‌లో పార్ట్ 3 కూడా ఉందని తేల్చేశారు. దీంతో, వచ్చే పార్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే, బన్నీ తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోతున్నారని తెలుస్తోంది. పురాణాల కథను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసిన సమాచారం. దీంతో, ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. పుష్ప 2 ( pushpa 2 )హవా ఇంకా నడుస్తూనే ఉంది. ఓటీటీలోనూ ఈ చిత్రం రికార్డులను సృష్టిస్తోంది. అయితే, ఓటీటీలోకి రావడంతో కొందరు దానిలో ఉన్న తప్పులను వెతుకుతున్నారు. ఇక ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కొన్ని సార్లు తప్పులు చేయడం సహజం. అలాగే, సుకుమార్ కూడా ఈ సినిమాలో చిన్న తప్పు చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదేమిటంటే..
పుష్ప తన ఇంట్లో సిండికేట్ సభ్యులతో మీటింగ్ లో ఉన్నప్పుడు తన భార్య శ్రీవల్లి ఏదో కూర వండానని చెప్పి రుచి చూడమని అడుగుతుంది. అయితే, అదే సమయంలో పుష్ప నోట్లో గుట్కా ఉంటుంది. సాధారణంగా నోట్లో గుట్కా ఉంటే ఎవరైనా దాన్ని ఉమ్మేసి, మౌత్ మొత్తం క్లీన్ చేసుకుని వేరేది తింటారు. కానీ, పుష్ప అలా చేయలేదు. నోట్లో గుట్కా ఉండగానే కూర రుచి చూసి బాగలేదని చెబుతాడు. మరి, అలాంటప్పుడు కూర రుచి ఎలా తెలుస్తుందంటూ సుకుమార్‌ను ( Sukumar ) తెగ ట్రోల్ చేస్తున్నారు.






