- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ స్టార్ చేతికి 'టైసన్ నాయుడు' ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
హాట్ స్టార్ సంస్థ 20 కోట్ల భారీ ధరకి టైసన్ నాయుడు ఓటీటీ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’ అనే పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘భీమ్లా నాయక్’ ఫేమ్ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, అందాల నటీమణులు ప్రగ్యా జైస్వాల్ మరియు నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం, ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను దాదాపు రూ. 20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఓటీటీ డీల్ కుదరక విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ చిత్రానికి ఇంత త్వరగా ఓటీటీ ఒప్పందం కుదరడం ఎంతో పాజిటివ్ సంకేతంగా భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట మరియు గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






