తెలుగులో హాట్ స్పాట్ టు మచ్

by Sujitha Rachapalli |

తమిళంలో 2024లో విడుదలై మంచి విజయం సాధించింది ‘హాట్ స్పాట్’ మొదటి భాగం. తాజాగా శుక్రువారం రిలీజ్ అయిన ‘హాట్ స్పాట్’ రెండో భాగం కూడా ఘన విజయం సాధించింది.

తెలుగులో హాట్ స్పాట్ టు మచ్
X

దిశ, సినిమా : తమిళంలో 2024లో విడుదలై మంచి విజయం సాధించింది ‘హాట్ స్పాట్’ మొదటి భాగం. తాజాగా శుక్రువారం రిలీజ్ అయిన ‘హాట్ స్పాట్’ రెండో భాగం కూడా ఘన విజయం సాధించింది. మొదటి మూడు రోజుల్లో 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా అర్బన్ యూత్‌ను ఆకట్టుకొని మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. హాట్ స్పాట్ మొదటి భాగం తెలుగులో ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘హాట్ స్పాట్ 2 మచ్’ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఫిబ్రవరి 13న వాలంటైన్స్ డే సందర్బంగా రిలీజ్ చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. ప్రియా భవాని శంకర్, ఏం ఎస్ భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్ నటించిన ఈ చిత్రానికి నిర్మాత అనిల్ కె రెడ్డి కాగా దర్శకుడు విఘ్నేశ్ కార్తిక్.

Next Story