- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రైడ్-2’ అప్డేట్ ఇచ్చిన హాట్ బ్యూటీ.. మిమ్మల్ని వ్యసనపరులుగా మార్చేస్తుందంటూ ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), వాణి కపూర్(Vaani Kapoor) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రైడ్-2’(Ride-2).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), వాణి కపూర్(Vaani Kapoor) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రైడ్-2’(Ride-2). ఈ హైలీ యాంటిసిపేటెడ్ చిత్రాన్ని రాజ్ కుమార్ గుప్తా(Raj Kumar Gupta) తెరకెక్కిస్తుండగా.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్యాప్‌లో రాబోతుంది. అయితే దీనిని పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషన్ కుమార్, మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘రైడ్’ సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ మూవీ భారీ అంచనాల మధ్య మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ‘రైడ్-2’ చిత్రానికి సంబంధించిన ఐటమ్ సాంగ్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందరికీ వ్యసనంగా మారే ట్రాక్ రాబోతున్నట్లు తెలుపుతూ ప్రొమో వీడియోను నెట్టింట పెట్టారు. అయితే హనీ సాంగ్ పాడగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాడేజ్(Jacqueline Fernandez) అజయ్ దేవ్‌గణ్‌తో చిందులేయనుంది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె కూడా ట్వీట్ చేసింది. అయితే ఈ ఫుల్ పాట మాత్రం ఏప్రిల్ 22న విడుదల కాబోతున్నట్లు వెల్లడించింది.






