- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుగ్లాసులతో దర్శనమిచ్చిన హాట్ బ్యూటీ.. టెంప్ట్ చేస్తున్నావుగా అంటూ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ భామ మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఏమైందో ఏమో కానీ అవకాశాలు రావట్లేదు.
ఇదిలా ఉంటే.. సినిమాల్లో ఆఫర్స్ రానప్పటికీ ఈ చిన్నది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. నిత్యం గ్లామర్ షో చేస్తూ వావ్ అనిపిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రకుల్ తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో యల్లో కలర్ అవుట్ ఫిట్‌లో స్టన్నింగ్ ఫొటోలకు పోజులిచ్చింది. అయితే ఆమె బ్యాక్ గ్రౌండ్‌లో మందు గ్లాసులు కనిపించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు టెంప్ట్ చేస్తున్నావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






