- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని’.. హాట్ బ్యూటీ తమన్నా ఆసక్తికర వ్యా్ఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఓదెల-2(Odela 2) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannah Bhatia) ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. ‘15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఎన్నో విభిన్న పాత్రలు చేశాను. ఎంతో మంది డైరెక్టర్లతో పనిచేశాను. కానీ.. ఇది చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్.. ఈ పాత్రలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాననే అనుకుంటున్నాను. సినిమా చూశాక అభిమానులు ఇచ్చే రివ్యూను గౌరవిస్తాను. నా పాత్రకు నేను న్యాయం చేశానో లేదో కూడా అభిమానులే డిసైడ్ చేస్తారు. ఏప్రిల్ 17వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని తమన్నా మాట్లాడారు.
తమన్నా శివశక్తిగా నటించిన సినిమా ‘ఓదెల 2’ (Odela 2). ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించారు. ఈ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.