Su from So: ఓటీటీలోకి లేెటస్ట్ హారర్ కామెడీ చిత్రం.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

ఈ మధ్య కాలంలో డబ్బింగ్ మూవీలు తెలుగులో రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.

Su from So: ఓటీటీలోకి లేెటస్ట్ హారర్ కామెడీ చిత్రం.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో డబ్బింగ్ మూవీలు తెలుగులో రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఇదే క్రమంలోనే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘సు ఫ్రమ్ సో’ ఆగస్టు 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధం అయింది. ఈ హారర్ కామెడీ చిత్రం జియోహాట్‌స్టార్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌లో కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపారు టీమ్. షనీల్ గౌతమ్, సంధ్య, రాజ్ బి.శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి జేపీ తుమినాడ్ దర్శతక్వం వహించాడు. కేవలం రూ. 6 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం చాలా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 40 కోట్లు వసూళ్లు రాబట్టి సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం కావడంతో ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story