- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితంలో బ్యాలెన్స్డ్‌గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం.. దుమారం రేపుతున్న దీపిక పదుకొణె సంచలన కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె(Deepika Padukone) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె(Deepika Padukone) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898AD) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దిశా పటానీ(Disha Patani), కీర్తి సురేష్(Keerthi Suresh) వంటి స్టార్స్ యాక్ట్ చేశారు. అయితే గత ఏడాది జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల విషయంలోనూ ఎన్నో రికార్డులు తిరగరాసింది.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో ఈ అమ్మడు నటించనున్నట్లు ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాలతో ఆమెను తప్పించి దీపికా స్థానంలోకి త్రిప్తి డిమ్రిని తీసుకున్నారని టాక్. దీంతో ఇటీవల దీపికాకు సంబంధించిన పీఆర్ టీం స్పిరిట్ సినిమా స్టోరీని లీక్ చేసిందంటూ ప్రచారం నడిచింది. అందుకే డైరెక్టర్ సందీప్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇస్తూ నిన్న ట్వీట్ చేసినట్లుగా అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్.
ఈ క్రమంలో ఇప్పుడు దీపికా మాట్లాడిన మాటలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా.. అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జీవితంలో బ్యాలెన్స్డ్‌గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యమని.. దానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటానని.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటానని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి.






