ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో హోమ్‌బౌండ్ మూవీ.. భారత్ తరపున ఎంట్రీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-19 13:35:02  IST  )

జాన్వీకపూర్ (Janhvi Kapoor), ఇషాన్‌ ఖట్టర్‌ నటించిన ‘హోమ్‌బౌండ్‌’ (Homebound) సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది.

ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో హోమ్‌బౌండ్ మూవీ.. భారత్ తరపున ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: జాన్వీకపూర్ (Janhvi Kapoor), ఇషాన్‌ ఖట్టర్‌(Ishaan Khatter) ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్‌’ (Homebound Movie) సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నది. భారత్‌ తరపున ఎంట్రీ ఇచ్చినట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. నీరజ్‌ ఘైవాన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్న విషయం తెలిసిందే. 78వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా.. 9 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2025లోనూ దీన్ని ప్రదర్శించారు. సెప్టెంబర్‌ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు యువకులు విడిపోయి, మళ్లీ ఎలా కలుసుకుంటారు. ఈ ప్రయాణంలో వారి పోరాటాలు ఉంటాయనేది కథలో కీలకమైనదగా తెలుస్తోంది.

Next Story