Hombale Films: ఇండియన్ సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించే నిర్ణయం

by Pulgam srinivas |

Hombale Films: ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన హోంబాలే ఫిల్మ్స్. భారతీయ సినిమాలను ప్రపంచంలోని నలుమూలలకు విస్తరింపజేసే ఉద్దేశంతో ఈ సంస్థ ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది.

Hombale Films: ఇండియన్ సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించే నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ సినిమా ఖ్యాతిని ఇండియా వ్యాప్తంగా పెరగడానికి తోడ్పడిన నిర్మాణ సంస్థల్లో హోంబాలే ఫిల్మ్స్ ఒకటి. ఈ సంస్థ వారు యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 1, కేజిఎఫ్ చాప్టర్ 2 అనే చిత్రాలను నిర్మించారు. ఈ రెండు చిత్రాలు అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఒక్కసారిగా కన్నడ సినీ పరిశ్రమకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ నిర్మాణ సంస్థకు మంచి పేరు, ప్రతిష్టలు దక్కాయి. ఆ తర్వాత వీరు రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందిన కాంతారా సినిమాను రూపొందించారు.

ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నిర్మాణ సంస్థ మరింత గొప్ప స్థాయికి చేరింది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సాలార్ అనే చిత్రాన్ని కూడా ఈ సంస్థ వారు నిర్మించారు. ఇది కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సీక్వెల్ను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ వారు ప్రస్తుతం అనేక పెద్ద, మీడియం రేంజ్, చిన్న సినిమాలను నిర్మిస్తూ జెట్ స్పీడులో దూసుకుపోతున్నారు.

ఇప్పటికే ఇండియావ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నిర్మాణ సంస్థ ఇండియన్ సినిమాల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించే ప్లాన్ వేసింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ భారీ నిర్మాణ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టింది. భారతీయ సినిమాలను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టామని హోంబాలే ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది.




Next Story