- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, అతని భార్య అనుమానాస్పద మృతి
ప్రముఖ డైరెక్టర్, అతని భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ షాకింగ్ సంఘటన లాస్ లాస్ ఏంజెలెస్ (Los Angeles) లోని దర్శకుడు రాబ్ రీనర్ నివాసంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ డైరెక్టర్, అతని భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ షాకింగ్ సంఘటన లాస్ లాస్ ఏంజెలెస్ (Los Angeles) లోని దర్శకుడు రాబ్ రీనర్ (Rob Reiner) నివాసంలో చోటు చేసుకుంది. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, వారి శరీరాలపై కత్తిగాయాలు కనిపించాయి. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై, దీనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాబ్ రీనర్ మరణంతో హాలీవుడ్‌కు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆయన గత ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించారు. ఆయన నటించిన సపోర్టింగ్ క్యారెక్టర్లకు గాను రెండు ఎమ్మీ అవార్డులు (Emmy Awards) కూడా అందుకున్నారు. అంతేకాకుండా, స్టాండ్ బై మీ (Stand by Me), ది ప్రిన్సెస్ బ్రైడ్ (The Princess Bride), వెన్ హ్యారీ మెట్ సాలీ (When Harry Met Sally) తదితర అద్భుతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. వారి అనుమానాస్పద మృతి కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. వారి మరణం వెనుక గల అసలు కారణాలు, కుట్రదారుల గురించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ కేసు పరిశ్రమలో ఒక మిస్టరీగా మారింది.






