‘హిట్’ సెవెంత్ కేస్ వరకు ఉంటుంది.. డైరెక్టర్ శైలేష్ కొలను ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |

టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) మనందరికీ సుపరిచితమే.

‘హిట్’ సెవెంత్ కేస్ వరకు ఉంటుంది.. డైరెక్టర్ శైలేష్ కొలను ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) మనందరికీ సుపరిచితమే. హిట్ (HIT: The First Case, HIT: The Second Case) (HITverse) వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో పాటు 'సైంధవ్' సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. అయితే రీసెంట్‌గా వచ్చిన హిట్-3 మూవీ మంచి విజయం సాధించింది. నాని(Nani) హీరోగా నటించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించింది.వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించాడు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ‘ప్రజెంట్ నేను హిట్ కేస్ 4 పై కథ రాస్తున్నా.. అయితే నాకు హిట్ సెవెంత్ కేస్ వరకు ఐడియాస్ ఉన్నాయి. అయితే సెవెంత్ కేస్‌లో ఇప్పటివరకు నటించిన అందరూ ఆఫీసర్స్ వచ్చి ఎవెంజర్స్‌లా ఒక స్పేస్‌కి తీసుకు వెళదామన్నది ఇక ఐడియా ఉంది. సిక్స్త్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. కేస్ 4 వరకు కొత్త కొత్త హీరోలు ఉంటారు. అయితే చాలా మంది కేస్ 4లో హీరో కార్తీ అని చాలా వార్తలు వస్తున్నాయి.. నేను దాని గురించి ఇప్పుడే క్లారిటీ ఇవ్వాలనుకోవడం లేదు. ఉండొచ్చు ఉండకపోవచ్చు. సెవెన్ వరకు ఐడియాలు రెడీగా ఉన్నాయి కానీ కథలు రెడీగా లేవు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story