‘ఈ నగరానికి ఏమైంది 2’నుంచి ఈ నటుడు ఔట్?

by velandi.Saikiran |

ఈ నగరానికి ఏమైంది 2 సినిమాలో ( ENE2) భారీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘ఈ నగరానికి ఏమైంది 2’నుంచి ఈ నటుడు ఔట్?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల చిన్న సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద హిట్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఈ నగరానికి ఏమైంది అనే సినిమా కూడా ఉంది. ఈ మూవీకి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా చేసిన సంగతి తెలిసిందే. 2018లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది. అంచనాలకు మించి రాణించింది.

ఈ నగరానికి ఏమైంది 2 సినిమాలో ట్విస్ట్

ఈ నగరానికి ఏమైంది 2 సినిమాలో ( ENE2) భారీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన ఓ నటుడు దూరం కాబోతున్నాడట. విశ్వక్ సేన్ గ్యాంగ్ లో ఉన్న సాయి సుశాంత్ ( Sushanth Reddy) రెండవ పార్ట్ నుంచి తప్పుకున్నట్లు టాక్ నడుస్తోంది. అతని స్థానంలో మరో నటుడిని తీసుకోబోతున్నారట. ఆ కొత్త నటుడు శ్రీనాథ్ మాగంటి అని తెలుస్తోంది. హిట్ సిరీస్ లో శ్రీనాథ్ మాగంటి ( Srinath Maganti) నటించిన మెప్పించారు. అతడినే ఇప్పుడు సుశాంత్ రెడ్డి స్థానంలో నటించబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

Next Story