Prabhas: హిట్ కాంబో రిపీట్.. మరోసారి ఆ స్టార్ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్న డార్లింగ్.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-02 11:09:34  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు.

Prabhas: హిట్ కాంబో రిపీట్.. మరోసారి ఆ స్టార్ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్న డార్లింగ్.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం కల్కి-2, సలార్-2(Salar-2), ఫౌజి, ది రాజాసాబ్, స్పిరిట్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ‘స్పిరిట్’ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తున్నట్లు టాక్. దీంతో పాటు ఈ అమ్మడు ‘కల్కి-2’లోనూ నటిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కల్కి’ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏకంగా వీరిద్దరు మూడు చిత్రాల్లో నటిస్తుండటంతో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. కాగా, దీపికా పదుకొణె(Deepika Padukone) ‘కల్కి’ సమయంలోనే ప్రెగ్నెంట్ కావడంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె గత కొద్ది రోజుల నుంచి పాప అలనా పాలనా చూసుకుంటుంది. త్వరలోనే ఆమె రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. అందుకోసం కథలు కూడా వింటున్న దీపికా వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్స్‌లో చాన్స్ అందుకోవడంతో అభిమానులు ఆనందపడుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story