- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ నటి అరెస్ట్..కారణం తెలిస్తే ఛీ కొట్టకుండా ఉండలేరు!
గుహవాటిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసు(Hit And Run Case)లో ప్రముఖ అస్సామీ నటిని నేడు డిస్పూర్ పోలీసులు అరెస్ట్ చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : గుహవాటిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసు(Hit And Run Case)లో ప్రముఖ అస్సామీ నటిని నేడు డిస్పూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. జులై 25న 21 ఏళ్ల నల్బరి పాలిటెక్నిక్ విద్యార్థి సమియుల్ హక్‌ను తన కారుతో ఢీకొట్టిన కేసులో నటి నందిని కశ్యప్(Nandini Kashyap) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్టు డీసీపీ జయంత్ సారథి పేర్కొన్నారు. ఆ విద్యార్ధి గుహవాటి మున్సిపల్ కార్పొరేషన్‌లో తాత్కాలిక ఉద్యోగిగా ఉండగా.. ప్రమాద సమయంలో స్ట్రీట్ లైట్ల మరమ్మతు పని చేస్తున్నాడు.
ఆక్సిడెంట్ తర్వాత నందిని సంఘటనా స్థలం నుంచి పారిపోయి కాహిలీపారాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో దాక్కున్నట్లు సాక్షులు తెలిపారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ విద్యార్ధి మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
Next Story






