- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hit-3: నేచురల్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. సర్కార్ & అతని పిచ్చికి స్వాగతం అంటూ పోస్ట్
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ (Hit-3).

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ (Hit-3). హిట్ ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాని అర్జున్ సర్కార్ (Arjun Sarkar) అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్ వంటి అప్‌డేట్స్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించగా.. ‘హిట్-3’ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
భారీ అంచనాల మధ్య ఈ మూవీ మే-1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు. ‘సర్కార్ & అతని పిచ్చికి వైజాగ్ స్వాగతం పలుకుతుంది. ఏప్రిల్ 14న ఉదయం 10.30 గంటల నుండి వైజాగ్‌లోని సంగం థియేటర్‌లో హిట్-3 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్‌కు హాజరకాలేని వారు ఏప్రిల్ 14న ఉదయం 11.07 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక విడుదలైన గ్లింప్స్‌కు మాస్ రెస్పాన్స్ రాగా.. ట్రైలర్‌పై హై లెవల్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.






