HIT-3 MOVIE: ఓటీటీని షేక్ చేస్తున్న నాని సినిమా.. 23 దేశాల్లో ట్రెండింగ్

by Ajay Maddhiboyina |

నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా హిట్-3. ఈ సినిమా థియేట‌ర్ల‌లో మే 1వ తేదీన‌ విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అ

HIT-3 MOVIE: ఓటీటీని షేక్ చేస్తున్న నాని సినిమా.. 23 దేశాల్లో ట్రెండింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా హిట్-3. ఈ సినిమా థియేట‌ర్ల‌లో మే 1వ తేదీన‌ విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేట‌ర్ లో కంటే ఈ సినిమాకు ఓటీటీలో మ‌రింత క్రేజ్ పెరిగింది. కేవ‌లం ఇండియాలోనే కాకుండా మ‌రో ఏడు దేశాల్లో ఈ చిత్రం నంబ‌ర్ 1 స్థానంలో నిలిచింది. అదే విధంగా 23 దేశాల్లో ఈ చిత్రం టాప్-10లో కొన‌సాగుతుండ‌టం విశేషం.

థియేట‌ర్ల‌లో రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన సినిమా ఓటీటీలోనూ అద‌ర‌గొడుతుండ‌టంతో నాని అభిమానులు, మేక‌ర్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నాని హీరోగా న‌టించ‌డంతో పాటూ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమాకే కాకుండా హిట్ సిరీస్ మొత్తాన్ని నాని సొంత బ్యాన‌ర్లోనే నిర్మించాడు. హిట్ పార్ట్ 1లో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌గా, హిట్ 2లో అడ‌వి శేషు హీరోగా న‌టించాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించాయి. ఇప్పుడు హిట్ 3 కూడా విజ‌యం సాధించ‌డంతో ద‌ర్శ‌కుడిగా శైలేష్ కొల‌ను హ్యాట్రిక్ కొట్టేశాడు.

Next Story