బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న హిట్-3.. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే(పోస్టర్)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-03 09:40:19  IST  )

నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3).

బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న హిట్-3.. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే(పోస్టర్)
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3). శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అయితే భారీ అంచనాల నడుమ మే 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతోంది. అలాగే కలెక్షన్ల విషయంలోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇందులో భాగంగా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లు సాధించి నాని కెరీర్​లో అదిరే ఆరంభాన్ని నమోదు చేసింది. ఇక రెండో రోజూ మంచి వసూళ్లను రాబట్టింది. శుక్రవారం ఈ మూవీ రూ.19 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.

దీంతో 2 రోజుల్లోనే హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా రూ. 62 కోట్ల (గ్రాస్) మార్క్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బాక్సాఫీస్ వద్ద అర్జున్ సర్కార్ వేట కొనసాగుతోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా వీకెండ్స్ కావడంతో శనివారం, ఆదివారం.. మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక రూ.100 కోట్ల మార్క్​ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story