ఆ స్టార్ నిర్మాత చేతికి ‘ఫౌజీ’ హిందీ థియేట్రికల్ హక్కులు

by Pulgam srinivas |

‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించిన హిందీ థియేట్రికల్ హక్కులను బాలీవుడ్ స్టార్ నిర్మాత అనిల్ తాడని భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.

Prabhas Injured on Fauzi Sets
X

Prabhas Injured on Fauzi Sets

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా, హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించిన హిందీ థియేట్రికల్ హక్కులను బాలీవుడ్ స్టార్ నిర్మాత అనిల్ తాడని భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హిందీ మార్కెట్‌లో ఆయనకు మంచి పట్టు ఉండటంతో, ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు లభించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంటే హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించే అవకాశం కూడా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.

Next Story