Pradeep Ranganathan:ప్రదీప్ ‘డ్యూడ్’ కోసం అత్యధిక OTT డీల్.. ఎన్ని కోట్లంటే?

by Chukka Sudharani |

‘డ్రాగన్’తో ఓవర్ స్టార్‌గా మారిపోయిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు.

Pradeep Ranganathan:ప్రదీప్ ‘డ్యూడ్’ కోసం అత్యధిక OTT డీల్.. ఎన్ని కోట్లంటే?
X

దిశ, సినిమా: ‘డ్రాగన్’తో ఓవర్ స్టార్‌గా మారిపోయిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇందులో ‘డ్యూడ్’ (Dude) ఒకటి. కీర్తి శ్వరన్ (Kirti Swaran) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో 2025 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ప్రేక్షకుల్లో ‘డ్యూడ్’ చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చెయ్యగా.. ఇంకా ఈ మూవీ రిలీజ్‌కు మూడు నెలలు ఉండగానే అప్పుడే ఓటీటీ (OTT) డీల్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను రూ. 25 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. ప్రదీప్ సినీ కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇది అత్యధిక ఓటీటీ డీల్ అని తెలుస్తుంగా.. ‘వావ్ సూపర్.. ఇదే కదా మా ఫ్యాన్స్‌కు కావాల్సింది’ అంటూ రియాక్ట్ అవుతున్నారు అభిమానులు. Link

Next Story