అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత !

by velandi.Saikiran |   (  Updated:2025-04-11 12:58:14  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే ( Allu A

అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత !
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే ( Allu Arjun Birth day) కావడంతో.. వందలాది సంఖ్యలో ఆయన అభిమానులు ఇంటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నివాసం ( Allu Arjun House) వద్ద ఫ్యాన్స్ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద అభిమానులు ( Fans )... హంగామా చేస్తున్నారు. అల్లు అర్జున్ కు విషెస్ చెప్పేందుకు... తరలి వచ్చారు అభిమానులు.

అయితే అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో.. అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ కేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు ( Polices). అయినప్పటికీ ఆ భారీకేడ్లను... తోసుకుంటూ అల్లు అర్జున్ ఇంటి వైపు దూసుకు వెళ్లారు అభిమానులు. అయితే వారిని కట్టడి చేసేందుకు... పోలీసులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ ఇంటి దగ్గర కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ఇలా ఉండగా ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో... తన కొత్త సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. అందరూ ఊహించినట్లుగానే అట్లీ కుమార్ (Atlee Kumar).. అనే తమిళ దర్శకుడు తో సినిమా చేస్తున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో... ఉండేలా కనిపిస్తోంది.

Next Story