- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భూల్ చుక్ మాఫ్’ విడుదలపై ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. షాకింగ్ ట్వీట్ వైరల్
బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao), వామికా గబ్బి(Wamika Gabbi) జంటగా నటించిన లేటెస్ట్ సినియా ‘భూ ల్ చుక్ మాఫ్’(Bhool Chuk Maaf) .

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao), వామికా గబ్బి(Wamika Gabbi) జంటగా నటించిన లేటెస్ట్ సినియా ‘భూ ల్ చుక్ మాఫ్’(Bhool Chuk Maaf) . ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మాడ్‌డాక్ ఫిల్మ్స్, దినేష్ విజన్ బ్యానర్స్‌పై నిర్మించారు. అయితే ఈ సినిమా చిక్కుల్లో పడింది. మే 9న థియేటర్స్‌లో విడుదల కావాల్సి ఉండగా.. ఈ సమయంలోనే ఆపరేషన్ సిందూర్ జరగడంతో మేకర్స్ ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపారు. ఈక్రమంలోనే.. ఈ సినిమా అసలు ఓటీటీలోకి, థియేటర్స్‌లో ఎక్కడా విడుదల చేయికుండా బాంబే హై కోర్ట్ స్టే విధించినట్లు సమాచారం. పీవీఆర్ సంస్థ ఈ సినిమా కోసం తాము చాలా ఖర్చు చేశామని ఓటీటీలో విడుదల చేయడం సరికాదని రూ. 60 కోట్ల దావా వేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు ‘భూల్ చుక్ మాఫ్’ విడుదలపై స్టే విధించింది. తాజాగా, ఈ కేసు విచారించిన కోర్టు తీర్పును ఇచ్చింది. ‘భూల్ చుక్ మాఫ్’ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మే 23న థియేటర్స్‌లో విడుదల చేసి.. రెండు వారాలకు జూన్ 6న ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ విడుదలయ్యే చేయాలని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అయితే థియేటర్ రిలీజ్‌కు ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని ఐనాక్స్ సంస్థ చిత్ర నిర్మాణ సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘భూల్ చుక్ మాఫ్’ మాత్రం రెండు వారాలకే రాబోతుండటాన్ని ఒప్పుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






