HHVM: తిరుపతిలో ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులు ఎవరంటే?

by Chukka Sudharani |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) ఒకటి.

HHVM: తిరుపతిలో ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులు ఎవరంటే?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) ఒకటి. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగం ఈ జూన్ 12న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం ‘హరిహర వీరమల్లు’ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్‌కు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్ మేరకు.. HHVM సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారట మేకర్స్. తిరుపతిలో ఈ ఈవెంట్ జగనుందని తెలుస్తుండగా.. దీనికి ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi), సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పాల్గొననున్నారని తెలుస్తోంది. అలాగే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌పై కూడా త్వరలో అప్‌డేట్ ఇవ్వనున్నట్లు టాక్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.




Next Story