ప్రీరిలీజ్ ఫంక్షన్ ఎఫెక్ట్.. ఫ్యాన్స్‌కు HHVM నిర్మాత కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ రేపు(సోమవారం) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా జరుగబోతోంది.

ప్రీరిలీజ్ ఫంక్షన్ ఎఫెక్ట్.. ఫ్యాన్స్‌కు HHVM నిర్మాత కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ రేపు(సోమవారం) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా జరుగబోతోంది. ఈ ఫంక్షన్‌కు హీరో పవన్ కల్యాణ్‌తో పాటు రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(TG), కందుల దుర్గేశ్(AP), దిగ్గజ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు హాజరు కాబోతున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో అభిమానులకు చిత్రబృందం కీలక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.

‘అభిమానులు.. అందరికీ నమస్కారం. ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి మీరు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారని మాకు తెలుసు. మీ ప్రేమను మేము అర్థం చేసుకోగలం. దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే వేదిక వద్దకు రావాలని కోరుతున్నాం. పాసులు లేకుండా అక్కడికి వస్తే.. ఎంట్రీ ఉండదు. భారీ సంఖ్యలో గుమిగూడటం వల్ల చాలా ఇబ్బందిగా మారుతుంది. ఫంక్షన్ సజావుగా జరిగేందుకు సహకరించండి’ అని హరిహర వీరమల్లు చిత్రబృందం అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

ఇదిలా ఉండటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోరాట యోధుడి పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. జూలై 24న విడుదల ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ‘హరిహర వీరమల్లు’ విడుదల కాబోతోంది.

Next Story