- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హే భగవాన్!’.. సుహాస్ సినిమా పూర్తి..
సుహాస్ యూనిక్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. ప్రస్తుతం నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో ‘హే భగవాన్!’ సినిమా చేస్తున్నారు. ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.

దిశ, సినిమా : సుహాస్ యూనిక్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. ప్రస్తుతం నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో ‘హే భగవాన్!’ సినిమా చేస్తున్నారు. ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఇది ఈ ప్రొడక్షన్ హౌజ్‌లో వస్తున్న రెండో సినిమా కాగా రైటర్ పద్మభూషణ్ ఫేం షణ్ముక ప్రశాంత్ ఈ కథను రాశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో సస్పెన్స్, కామెడీ అదిరిపోయింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుపుతూ చిత్ర బృందం నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో శివాని నగరం హీరోయిన్‌గా నటిస్తుండగా.. డా. నరేష్ వికె, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవోపీ మహి రెడ్డి పండుగల, సంగీతం వివేక్ సాగర్, ఎడిటర్ విప్లవ్ నిషాదం, ఆర్ట్ డైరెక్టర్ ఎ రామ్ కుమార్ తమ తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.






