- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'హే బల్‌వంత్'కి షాకింగ్ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైం ఎంతో తెలుసా.?
హే బల్‌వంత్ చిత్రానికి సెన్సార్ బోర్డు "ఏ" సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రం 134 నిమిషాల 02 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దిశ, వెబ్ డెస్క్ : సుహాస్, శివానీ నగరం జంటగా గోపి అర్చర దర్శకత్వంలో హే బలవంత్ అనే సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, స్రవంతి చొక్కారపు, నరేష్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ని ఫిబ్రవరి 20న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి "ఏ" సర్టిఫికెట్ను జారీ చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ చిత్రం డీసెంట్ రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను 134 నిమిషాల 02 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమాకు మొదట హే భగవాన్ అనే టైటిల్ అనుకున్నారు. అలాగే పెద్ద ఎత్తున ప్రచారాలను కూడా నిర్వహించారు. కానీ సెన్సార్ బోర్డు సభ్యులు హే భగవాన్ అనే టైటిల్ ఉంచినట్లయితే "ఏ" సర్టిఫికెట్ ఇస్తామని, టైటిల్ మారిస్తే బెటర్ సర్టిఫికెట్ ఇస్తామని సూచించినట్లు, దానితో ఈ మూవీ యూనిట్ వారు ఆఖరి నిమిషంలో టైటిల్ మార్చారని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకు టైటిల్ మార్చిన తరువాత కూడా "ఏ" సర్టిఫికెట్ రావడంతో ఈ మూవీ బృందం వారు ఎందుకు టైటిల్ను మార్చారా అనే అనుమానాలు జనాల్లో రేకెత్తాయి.






