- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు రెమ్యునరేషన్ తగ్గించుకోండి.. హీరోలను తాకిన ఎగ్జిబిటర్ల వివాదం
ఎగ్జిబిటర్ల వివాదం ఇప్పుడు హీరోలను సైతం తాకింది. థియేటర్లు నష్టాల్లో ఉన్నాయని తమకు వర్కౌట్ అవ్వడంలేదని ఎగ్జిబిటర్లు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఎగ్జిబిటర్ల వివాదం ఇప్పుడు హీరోలను సైతం తాకింది. థియేటర్లు నష్టాల్లో ఉన్నాయని తమకు వర్కౌట్ అవ్వడంలేదని ఎగ్జిబిటర్లు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్ ధరలు తగ్గిస్తే ప్రేక్షకులు సినిమాలకు వస్తారని పవన్ కల్యాణ్ కీలక వ్యాక్యలు చేశారు. టికెట్ ధర కంటే సినిమా హాళ్లలో తినుబండాల ధరలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటే కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని చెప్పారు. అయితే తాజాగా రాజమండ్రి ఎగ్జిబిటర్లు ఈ వివాదంపై స్పందించారు. హీరోలు కలగజేసుకుంటేనే థియేటర్లు బతుకుతాయని అన్నారు. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని సూచించారు. అంతే కాకుండా వారు ఏడాదికి రెండు మూడు సినిమాలు అయినా చేయాలని చెప్పారు.
సినిమాలు రాకపోవడంతో రోజుకు రెండు షోలు థియేటర్లను మూసేస్తున్నామని అన్నారు. రాజకీయాలకు సినిమా థియేటర్ల వ్యాపారానికి సంబంధం లేదని అన్నారు. సినిమా నిర్మాణానికి ఎక్కువ ఖర్చు చేశామని నిర్మాతలు అంటున్నారని, వాళ్లు సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పారు. తాము డిస్ట్రిబ్యూటర్లకు సినిమా కోసం 40 నుండి 50 లక్షల అడ్వాన్స్ ఇస్తున్నామని అవి ఎప్పుడు వస్తాయో తెలియదని చెప్పారు. అందరూ ఈ వివాదంపై స్పందిస్తున్నారని కానీ హీరోలు స్పందించడం లేదని అన్నారు. రాజమండ్రి, కాకినాడలో ఇప్పటికే కొన్ని థియేటర్లు పూర్తిగా మూసివేశారని తాము ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నామని అన్నారు.






