- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హైంధవ’ నుంచి హీరో ఫస్ట్ లుక్ రిలీజ్.. దశావతారంలో గూస్ బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) రీసెంట్‌గా ‘కిష్కింద పురి’(Kishkindapuri) మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) రీసెంట్‌గా ‘కిష్కింద పురి’(Kishkindapuri) మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా మూవీ ‘హైంధవ’(HAINDAVA) నటిస్తున్నాడు. యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి లుధీర్ బైరెడ్డి(Ludhir Byreddy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘హైంధవ’ నుంచి తాజాగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘ఒక శక్తివంతమైన శక్తి పైకి లేచినప్పుడు, దశావతారాలు కాపలాగా నిలుస్తాయి.. త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది’ అని రాసుకొస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌లో.. బెల్లంకొండ శ్రీనివాస్ ఒక చేతిలో రక్తంతో తడిసిపోయిన గొడ్డలిని మరో చేతిలో అగ్నిని పట్టుకుని నీళ్లలో గట్టిగా అరుస్తూ వైల్డ్‌గా చూస్తున్నాడు. ఇక అతని వెనుక గుడ్ల గూబ భయంకరంగా చూస్తుంది. అలాగే హీరోకి పోస్టర్‌లో కొమ్ములు ఉన్నట్లుగా ఉంది. ఫైనల్‌గా దశావతారంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ భయపెట్టించే విధంగా ఉంది.






