నేను చిక్కుకున్నా.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటూ హీరోయిన్ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

హీరోయిన్ కృతి కర్బంద(Kriti Kharbanda) ‘బోని’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

నేను చిక్కుకున్నా.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటూ హీరోయిన్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: హీరోయిన్ కృతి కర్బంద(Kriti Kharbanda) ‘బోని’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక తెలుగులో మిస్టర్ నూకయ్యా, ఓం, ఒంగోల్ గిత్త(Ongole Gittha) వంటి చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘బ్రూస్‌లీ’ సినిమాలో మెగా హీరోకు అక్కగా నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక గత ఏడాది ఆమె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది కాలంపాటు ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ ‘హౌస్‌ఫుల్-5’తో రీఎంట్రీ ఇస్తోంది. తాజాగా, కృతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ఈరోజు నేను రెండు భావాల మధ్య చిక్కుకున్నాను. రెండింటిని నేను అనుభవిస్తున్నాను. నా తోబుట్టువలతో ఒక సంభాషణ మమ్మల్ని జ్ఞాపకశక్తికి దారితీసింది.

నవ్వులు, విరామాల మధ్య నేను ఊహించని దానికంటే నన్ను బలంగా తాకింది. చిన్నతనంలో ఏమి తెలియని అమ్మాయిలా ఉన్నా. మహమ్మారితో జీవిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నేను పెద్దయ్యాక ప్రపంచాన్ని కొంచెం మెరుగ్గా అర్థం చేసుకున్నా. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. ప్రస్తుతం సంక్షోభంలో నివసిస్తున్న ప్రజల గురించి నేను ఆలోచిస్తాను. ముందుకు సాగడానికి రక్షించడానికి, పోరడటానికి దు:ఖించడానికి ఇంకా ఆశించడానికి వారికి బలం ఎక్క దొరుకుతుంది. దేశం కోసం పోరాడటం ఏమీటో నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఈ రోజు గ్రహించా. నా తలలో చాలా ప్రశ్నలు నడుస్తున్నాయి. కొన్నింటికి సమాధానాలు లేవు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు స్ట్రాంగ్‌గా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.

Next Story