‘ఫస్టే ఒకే చెప్పేశాను!’.. పవన్‌ కల్యాణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేయడం పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-10-12 04:52:22  IST  )

యంగ్ హీరోయిన్ రాశీఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

‘ఫస్టే ఒకే చెప్పేశాను!’.. పవన్‌ కల్యాణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేయడం పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాశీఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్‌కి ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో పరిచయమయ్యారు. ఈ చిత్రంలో రాశీ కన్నా నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇక, ‘జిల్’, ‘సుప్రీమ్’, ‘హైపర్’, ‘తొలి ప్రేమ’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘తొలి ప్రేమ’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆమె నటన, అందం, అభినయంతో తక్కువ సమయంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాశీఖన్నా ‘తెలుసు కదా’(Telusu Kada) చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 17వ తేదీన థియేటర్స్‌లోకి రాబోతుంది. అలాగే, పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో రాశిఖాన్న నటిస్తోంది. అయితే, తెలుసు కదా ప్రమోషన్స్ జోరు పెంచిన హీరోయిన్ రాశీఖన్నా(Raashi Khanna) ఓ ఇంటర్వ్యూలో సినీ నటుడు పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)తో కలిసి నటించిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’(Usthad Bhagath Singh) కోసం డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ ఫోన్‌ చేయగానే నేను వెంటనే ఓకే చెప్పాను అని తెలిపారు. ఫస్ట్ ఒకే చెప్పిన తర్వాతే కథ విన్నాను. పవన్‌ కల్యాణ్‌తో స్క్రీన్‌షేర్‌ చేయడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్.. నేను పవన్ కళ్యాణ్‌కు పెద్ద అభిమానిని అంటూ రాశీఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియో

Next Story